Site icon TeluguMirchi.com

పవన్ ఫ్యాన్ అయిపోయిందట

pranithaకధానాయికలంతా ఒకేలా ఆలోచిస్తారేమో? ఏ హీరో తో పనిచేస్తుంటే…. ఆ హీరోని తెగ మోసేసే కార్యక్రమంలో దిగిపోతారు. ‘ఇలాంటి స్టార్ ని ఎక్కడా చూడలేదు సుమీ …’ అంటూ తెగ కోతలు కోసేస్తారు. ప్రస్తుతం ప్రణీత కుడా కోతలు కోసే పనిలో పడింది. ‘బావ’, ‘శకుని’ సినిమాల్లో నటించినా ఆమెను పట్టించుకునే నాధుడే లేడు. అయినా లక్కులో కాలేసింది. పవన్ కళ్యాన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. పవన్-త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రూపుదిద్దు కుంటోంది. ఈ సినిమాలో రెండో నాయికగా ప్రణీత ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పటి నుంచి ప్రణీత పవన్ నామ జపం చేస్తోంది. ‘పవన్ సూపర్, గ్రేట్..’ అంటూ కితాబుల మీద కితాబులు ఇచ్చేస్తోంది. “ఎక్కడికి వెళ్ళినా పవన్ సినిమా గురించే ఆరా తీస్తున్నారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సూపర్. ఆయన సింప్లిసిటీ చూసి నేను కుడా ఫ్యాన్ అయిపోయాను. పవన్ తో సినిమా నాకు ఇదివరకు ఎప్పుడు రాని గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకం వుంది. పవన్ లాంటి స్టార్ సినిమాలో రెండో కదానాయిక గానే కాదు… ఎన్నో నెంబర్ అయినా ఓకే” అని తెగ ముచ్చట పడిపోతోంది.

Exit mobile version