Site icon TeluguMirchi.com

శ్రీను అహంకారం తగ్గించుకో..ప్రకాష్ రాజ్

PRAKASH-rajదర్శకుడు శ్రీను వైట్ల, ప్రకాష్ రాజ్ మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. ఆగడు సినిమా సమయంలో ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ ను ఆ చిత్రం నుండి తప్పించి ఆ ప్లేస్ లో సోను సొద్ ను తీసుకున్నాడు శ్రీను వైట్ల. అప్పట్లో ఇదో సంచలనం. ‘ఆగడు’ సెట్లో ప్రకాష్ రాజ్ కు అసిస్టెంట్ డైరెక్టర్ కు మద్య జరిగిన గొడవకు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది. అప్పటి నుండి శ్రీను, ప్రకాష్ కు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రకాష్ రాజ్…..శ్రీను వైట్ల పై మండి పడ్డారు. తన ఆవేదనను పద్య రూపంలో చెబితే తన అనుమతి లేకుండా శ్రీను వైట్ల తన సినిమాలో వాడుకున్నారని, ఏ మాత్రం సిగ్గున్నా తన అనుమతి తీసుకుని ఉండాల్సిందని ప్రకాష్ రాజ్ ధ్వజమెత్తారు. కక్ష్యతో కాదు…కసితో పని చేయాలని శ్రీను వైట్లకు సూచించారు ప్రకాష్ రాజ్. ఇంతటితో ఆగని ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు’ సినిమా విషయాన్ని కూడా ప్రస్తావించారు. డబ్బులు పెట్టే నిర్మాతలున్నా మహేష్ బాబు అభిమానులు మెచ్చే విధంగా శ్రీను వైట్ల సినిమా తీయలేక పోయారని విమర్శించారు.

Exit mobile version