Site icon TeluguMirchi.com

చిరుకి త‌లవంచిన‌ కృష్ణ‌వంశీ

chiruరామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయాలంటే ద‌ర్శ‌కులంతా త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిందే. ఎందుకంటే క‌థ‌లో, చిత్రీక‌ర‌ణ‌లో, మిగిలిన టీమ్ ఎంపిక‌లో చిరంజీవి విప‌రీతంగా జోక్యం చేసుకొంటార‌ని టాలీవుడ్ టాక్‌. కృష్ణ‌వంశీ సినిమా గోవిందుడు అంద‌రివాడేలే సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అర్థాంత‌రంగా ఆగిపోయింది. కార‌ణం.. చ‌ర‌ణ్‌కి ఒంట్లో బాగోక‌పోవ‌డ‌మేన‌ట‌. అంత ఒంట్లో బాగోలేక‌పోతే మ‌నం సినిమా చూస్తాడా..?? ఈ సినిమా విపరీతంగా న‌చ్చేసింద‌ని కామెంట్లు పెడ‌తాడా?? గోవిందుడు… తెర‌కెక్కించిన విధానం చిరుకి న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింద‌ని టాక్‌. దానికి త‌గ్గ‌ట్టే క‌థ‌లో, సినిమాలో అర్థాంతంగా మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది టీమ్‌. అందులో భాగంగానే రాజ్ కిర‌ణ్‌ని ప‌క్క‌కు త‌ప్పించి, ఆ స్థానంలో ప్ర‌కాష్‌రాజ్‌ని తీసుకొన్నారు. రాజ్‌కిర‌ణ్ కాల్షీట్లు లేవ‌ని, అందుకే ప్ర‌కాష్‌రాజ్‌ని తీసుకోవాల్సివ‌చ్చింద‌ని చిత్ర‌బృందం చెబుతున్నా, వాటిని ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. మొత్తానికి ఎవ్వ‌రికీ త‌ల‌వొంచ‌ని కృష్ణ‌వంశీ.. చిరుకి మాత్రం లొంగిపోయాడు. స్టార్ల‌తో సినిమా అంటే ఇలాంటివి త‌ప్ప‌వు మ‌రి.

Exit mobile version