Site icon TeluguMirchi.com

మోనార్క్… ఇక మార‌డా..??

 

అది దూకుడు అనుకోవాలా?
పొగ‌రు అని పిల‌వాలా?
అహంకారం అని చెప్పుకోవాలా?
ప్ర‌కాష్ రాజ్ దుందుడుకు వైఖ‌రితో లేని త‌ల‌నొప్పులు కొని తెచ్చుకొంటున్నాడు. ఆమ‌ధ్య స‌హాయ‌ద‌ర్శ‌కుడితో గొడ‌వ ప‌డి.. బ‌హిష్క‌ర‌ణ వేటుకి అతి ద‌గ్గ‌ర‌గా వెళ్లొచ్చాడు ప్ర‌కాష్‌రాజ్. నానా తంటాలూ ప‌డి, ఆ వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగాడు. బ‌డా ద‌ర్శ‌కులు ప్ర‌కాష్‌రాజ్ కి వెన్నుద‌న్నుగా నిల‌వ‌డంతో మోనార్క్ పై వేటు ఆగింది. ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకొన్నాడు. త‌న తోటి ప్ర‌యాణికుడితో గొడ‌వ ప‌డి మ‌రో మ‌చ్చ త‌న‌పై వేసుకొన్నాడు. బుధ‌వారం హైద‌రాబాద్ నుంచి చెన్నై ప్ర‌యాణ‌మ‌య్యాడు ప్ర‌కాష్‌ రాజ్‌. షంషాబాద్‌ లో చెన్నై వెళ్లే ఫ్లెయిట్ ఎక్కాడు. త‌న తోటి ప్ర‌యాణికుడు ప్ర‌కాష్ రాజ్‌ ని చూసి సంబ‌ర‌ప‌డ్డాడు. విమానంలో ప్ర‌కాష్‌ రాజ్‌ ని ఫొటో తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. పోనీ… అభిమానంతో ఫొటోలు తీస్తున్నాడ‌ని స‌రిపెట్టొచ్చు క‌దా..?? నువ్వెవ‌డు నా పొటోలు తీయ‌డానికి, నా అనుమతి లేకుండా నా ఫొటోలు తీస్తావా..?? అంటూ రెచ్చిపోయాడ‌ట‌. దానికి ఆ ప్ర‌యాణికుడు కూడా ఘాటుగా స‌మాధానం ఇవ్వ‌డంతో గొడ‌వ రేగింది. తోటి ప్ర‌యాణికులు, సిబ్బంది న‌చ్చ‌జెప్ప‌డంతో…. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. మోనార్క్ ఇంకెప్పుడు మార‌తాడో మ‌రి..!

Exit mobile version