Site icon TeluguMirchi.com

శ్రీ‌దేవికి ఫ్లాటైపోయిన ప్రకాష్ రాజ్‌..

Sridevi-prakash rajశ్రీ‌దేవిది ఇప్పటికీ చెక్కుచెద‌ర‌ని ఇమేజ్‌. వ‌యసు పైబ‌డుతున్నా… ఇప్పటికీ ఆమె అందానికి దాసోహం అయిపోయేవాళ్లు ఉన్నారు. మీ అభిమాన న‌టి ఎవ‌రు? అని అడిగితే ఈత‌రం వాళ్లు కూడా శ్రీ‌దేవి పేరే చెబుతారు. జాతీయ ఉత్తమ న‌టుడు ప్రకాష్‌ రాజ్ కూడా ఈ అతిలో్క సుంద‌రికి అభిమానేన‌ట‌. ఈ విష‌యాన్ని స్వయంగా ప్రకాష్‌ రాజే చెప్పారు. త‌మిళ టీవీ ఛానెల్ కోసం ఆయ‌న ఓ గేమ్ షో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ‌దేవి అతిథిగా వ‌చ్చారు. శ్రీ‌దేవి ఎపిసోడ్ పూర్తయ్యాక‌… ప్రకాష్ రాజ్ త‌న అభిమానాన్ని బ‌య‌ట‌పెట్టారు. ”నేను న‌టుడిగా మారే క్రమంలో అభిమానించిన తార‌ల్లో శ్రీ‌దేవి ఒక‌రు. ఆమెతో ప‌రిచ‌యం క‌లిగాక‌, ఆమెతో మాట్లాడ‌క‌, ఆమె వ్యక్తిత్వం తెలుసుకొన్న త‌ర‌వాత‌… మ‌రింత అందంగా క‌నిపించారు. శ్రీ‌దేవి ప్రభావం ఎంతోమంది క‌థానాయిక‌ల‌పై ఉంది. ఆమెతో క‌లిసి న‌టించే అవ‌కాశం రానందుకు బాధ‌గా ఉన్నా…. ఆమెను ఇలా క‌లిసే అదృష్టం ద‌క్కింద‌”ని మురిసిపోయారు.

Exit mobile version