Betting App Promotions : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే.. ?


Prakash Raj : నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. 2016లో తాను చేసిన యాడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని ఆయన తెలిపారు. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నానని, అందుకే 2017లో ఒప్పందం పొడిగించమని అడిగినప్పుడు తాను అంగీకరించలేదని చెప్పారు. అంతేకాదు, 2021లో ఆ కంపెనీని మరొక కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత, తన అనుమతి లేకుండానే యాడ్ ను మళ్లీ సోషల్ మీడియాలో వాడారని వెల్లడించారు. దీని వల్ల సంబంధిత కంపెనీకి లీగల్ నోటీసులు పంపించినట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ఎలాంటి గేమింగ్ యాప్‌ల ప్రచారకర్తగా వ్యవహరించడం లేదని స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్, తనపై పోలీసులు విచారణ చేపట్టినట్లయితే పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు.

Also Read : Betting App Promotions : చట్టప్రకారమే యాడ్ ప్రమోషన్స్ : విజయ్ దేవరకొండ

Also Read : మార్కో దర్శకుడితో దిల్ రాజు పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం