షూటింగ్‌లో గాయపడ్డ ప్రగ్యా జైస్వాల్‌

సినిమాలు, ఫైట్‌ సీన్‌లు తెర మీది చూసి ఆనందిస్తాం కానీ తెర వెనుక వారు పడ్డ కష్టం గురించి మాత్రం ఆలోచించం. ఎంత భారీ సీన్‌ వస్తే అంత భారీ కష్టం ఉంటుంది అనే విషయం సహజంగా గుర్తుకురాదు. అయితే షూటింగ్‌ సమయంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగి గాయపడుతూనే ఉంటారు. షూటింగ్‌లో గాయపపడం అనేది ఎక్కువగా హీరోలకు జరుగుతుంది. హీరోయిన్‌ల మీద యాక్షన్‌ సీన్‌లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వారికి అంతగా ఇబ్బంది ఉండదు. కానీ తాజాగా ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ షూటింగ్‌ సమయంలోనే గాయాల పాలయ్యింది.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘ఆచారి అమెరిక యాత్ర’ చిత్రంలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ యాక్షన్‌ సీన్‌లో ప్రగ్యా జైస్వాల్‌కు గాయాలు అయ్యాయట. చిత్ర యూనిట్‌ వెంటనే ప్రగ్యాను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రమాదం ఏమి లేదని, ప్రగ్యాను కాస్త విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారట.