Site icon TeluguMirchi.com

ప్రదీప్ ది ఎంత పెద్ద మనసు

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. పనిలేక..తిండి లేక రోజువారీ కూలి చేసి బ్రతికే కార్మికులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పెద్దఎత్తున విరాళాలు అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకొస్తున్నారు. చిత్ర సీమా నుండి ప్రతి ఒక్కరు తమ విరాళాన్ని అందజేస్తుండగా..తాజాగా యాంకర్ ప్రదీప్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. దీనికి సంబందించి ఆయన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. తనకు తెలిసిన ఓ 60 కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు అందిస్తున్నానని పేర్కోన్నాడు. అంతేకాదు మనలో సాయం చేయగల స్థోమత ఉన్నవారు ముందుకొచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన విధంగా సాయం చేయాలనీ కోరాడు. టీవీ యాంకర్‌గా పరిచయమై తనశైలిలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేస్తూ అక్కడ కూడా తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు. రీసెంట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం తో హీరోగా పరిచయం కాబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది.

Exit mobile version