Site icon TeluguMirchi.com

మిర్చి డేట్ ఫిక్స్

Prabhas-mirchiకొరటాల శివ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘మిర్చి’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ప్రభాస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలోఈ చిత్రాన్ని భారీగా రీలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రచయిత గా మంచి పేరు తెచ్చుకున్న కొరటాల శివ… దర్శకునిగా తన అదృష్టాన్నిపరీక్షించుకోనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటిస్తుండగా.. నటి నదియా అమ్మ పాత్రలో కనిపించనుంది.

Exit mobile version