పెళ్లిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బాహుబలుడు ప్రభాస్
ramesh
‘బాహుబలి’ చిత్రానికి ముందు డార్లింగ్ ప్రభాస్‌గా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ‘బాహుబలి’ తర్వాత బాహుబలుడుగా జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయిదేళ్ల నుండి ‘బాహుబలి’ కోసమే పని చేస్తున్న ప్రభాస్‌కు పెళ్లికి తీరిక లేకుండా పోయింది. ‘మిర్చి’ చిత్రం తర్వాతి నుండే ప్రభాస్ పెళ్లిపై వార్తలు వస్తుండగా ‘బాహుబలి’ తర్వాత అని తప్పించుకునే వాడు. కానీ ఇప్పుడు ఆ సమయం కూడా అయిపోయింది. ‘బాహుబలి’ షూటింగ్ పూర్తి అయ్యింది త్వరలో రెండో భాగం కూడా విడుదల కానుంది. తాజాగా రెండవ పార్టు ప్రమోషన్లో పాల్గోంటున్న ప్రభాస్‌ను పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నలతో ముంచేస్తున్నారు.
మీడియా వారు పెళ్లి గురించి అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియకనో లేదా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకనో కానీ పెళ్లిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి ఎప్పుడు అని అడగగా నో ఐడియా అంటూ తప్పించుకున్నాడు. అంతేకాకుండా నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకు కూడా తెలియదు అంటూ అందరికి షాకిచ్చాడు. ప్రభాస్ సమాధానం విన్నాక మీడియా సహా అంతా నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ప్రభాస్ త్వరలో సుజిత్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఇప్పటి వరకు పెళ్లి ఊసే లేదు. అసలు ఈ ఏడాది అయినా ప్రభాస్ పెళ్లి ఉంటుందా..? లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు.