తాజాగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించిన ప్రభాస్ మళ్లీ ‘బాహుబలి’ లాంటి అవకాశం వస్తే చేస్తారా..?? వెంటనే ఇలాంటి అవకాశానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని ప్రభాస్‌ను అడగగా వామ్మో.. లక్ష కోట్లిచ్చినా కూడా వెంటనే మళ్లీ ‘బాహుబలి’ లాంటి సినిమా చేయను. ఈ సినిమా కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు మరీ. స్కూలుకు వెళ్లే పిల్లాడిలా ‘బాహుబలి’ షూటింగ్ కోసం భయపడుతూ వెళ్లేవాడిని. రీటేక్ తీసుకోవడానికి కూడా చాలా భయమేసేది. ఎందుకంటే మళ్లీ అంతా సిద్దమవ్వాలంటే కనీసం మూడు నాలుగు గంటలు పడుతుంది. అంతేకాకుండా ఒక్కో షాట్‌కు లక్షల్లో ఖర్చు వస్తుంది. అందుకే సాద్యమైనంత వరకు జాగ్రత్తగా షాట్స్ చేసేవాడిని. ఓ అయిదు సంవత్సరాల తర్వాత ఏమో కాని ఇప్పట్లో మాత్రం ‘బాహుబలి’ లాంటి మరో అవకాశం వచ్చినా అసలే చేయను అంటూ ప్రభాస్ తన కష్టం గురించి వివరించాడు.