ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత చేసిన చిత్రం ‘సాహో’. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటుంది. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రం క్వాలిటీ విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్తున్న కారణంగా ఆలస్యంగా విడుదల కాబోతుంది. ప్రతి విషయంలో కూడా క్వాలిటీగా ప్రయత్నాలు చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ఒక యాక్షన్ పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. త్వరలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా పబ్లిసిటీలో భాగంగా ఈ యాక్షన్ పోస్టర్‌ను పోస్ట్ చేయడం జరిగింది.
ప్రభాస్‌తో పాటు శ్రద్దా కపూర్ గన్ పట్టుకుని విలన్స్‌ను షూట్ చేస్తున్న ఈ షాట్ అద్బుతంగా ఉంది. ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ పిక్ చూస్తే అనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడని యాక్షన్ సీన్స్‌ను సాహోలో చూడబోతున్నట్లుగా మొదటి నుండి చెబుతున్నారు. యాక్షన్ ఎక్కువ అయినా కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. అయితే యాక్షన్‌ను చూపిస్తూనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సుజీత్ ఈ చిత్రంను తెరకెక్కించినట్లుగా యూనిట్ సభ్యులు అంటున్నారు.