బాహుబలి 2 విడుదలైన తర్వాత ప్రభాస్ స్టార్డం పెరిగింది. ఆ కారణంగా సాహోకు 350 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయంలో 50 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అప్పటికే అది ప్రభాస్‌కు మరీ ఎక్కువ అన్నట్లుగా భావించారు. కాని బాహుబలి వారి ఆలోచన మార్చేసింది. 50 కోట్లు కాస్త 350 కోట్ల వరకు చేరింది. అంత భారీగా బడ్జెట్‌ను పెంచడంతో నిర్మాతలు ఇప్పుడు తల పట్టుకున్నారు. దాదాగా 100 నుండి 150 కోట్ల వరకు నష్టాలు తప్పవన్నట్లుగా ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.