‘సాహో’కు ‘ఎ’ వస్తే కష్టమే

ప్రభాస్‌, శ్రద్దా కపూర్‌ జంటగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ఆగస్టు 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం సెన్సార్‌ ముందుకు వెళ్లబోతుంది. అయితే సెన్సార్‌ ముందుకు వెళ్లబోతున్న ఈ చిత్రంకు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చే అవకాశం ఉందనే టాక్‌ వస్తుంది. ఒకవేళ ఎ సర్టిఫికెట్‌ వస్తే మాత్రం సినిమా వసూళ్లపై చాలా ప్రభావం పడుతుంది. మల్టీప్లెక్స్‌ల్లో ఎ సర్టిఫికెట్‌ వచ్చిన సినిమాలకు 18 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించరు. అదే కనుక జరిగితే సాహో చిత్రం భారీగా నష్టపోతుంది.

సాహో చిత్రంకు ఎట్టి పరిస్థితుల్లో ఎ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సెన్సార్‌కు వెళ్లే ముందే ఎ వచ్చే సీన్స్‌ మరియు డైలాగ్స్‌ తొలగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు యూ/ఎ సర్టిఫికెట్‌ వచ్చేలా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉన్న కారణంగా క్లీన్‌ యూ అయితే అసాధ్యం. ఇలాంటి సమయంలో యూ/ఎ ను తెచ్చుకునేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సెన్సార్‌ క్లియరెన్స్‌ రానుందని తెలుస్తోంది.