ప్రభాస్ అసలు నిద్రే పోవడం లేదట.

ఎవరైనా సినిమా రిలీజ్ టైం లో టెన్షన్ తో నిద్ర పోరు..కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి రిలీజ్ తర్వాత నిద్ర పోవడం లేదట..ఎందుకా అనుకుంటున్నారా. గురువారం రోజు బాహుబలి2 ప్రీమియర్స్ మొదలు నుంచి ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అనేక వందలు.. వేల కొద్దీ ఫోన్స్ వస్తున్నాయట. కాస్త కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూ గా కాల్స్.. మెసేజ్ లతో ప్రభాస్ మొబైల్ మోగుతూనే ఉందట. ప్రతీ ఒక్కరూ తెగ ప్రశంసలు గుప్పించేస్తూ.. అసలు విరామం కూడా ఇవ్వడం లేదట. దీంతో ప్రభాస్ కు కంటి మీద కునుకే ఉండడం లేదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఇల్లు..అభిమానులు , స్టార్స్ రాక తో కళాకలాడుతుందట..బాహుబలి కోసం ఐదేళ్లు తన కెరియర్ ను పక్కన పెట్టి కష్ట పడ్డాడు..కానీ ఈ ఐదేళ్ల లో 10 సినిమాలు చేసిన రాని పేరు ఒక్క బాహుబలి కే రావడం తో ప్రభాస్ ఆనందం మాములుగా లేదట. ఇక త్వరలోనే సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సాహో మూవీ షూటింగ్ లో పాల్గొనబోతాడట.