ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ మూవీ ని పాన్ ఇండియా గా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే జార్జియా లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.
తదుపరి షెడ్యూల్ ను విదేశాల్లో జరపాల్సి ఉండగా..ప్రస్తుతం కరోనా దెబ్బకు విశేషాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో విదేశాల్లో షూటింగ్ పర్మిషన్ ఇవ్వడం అంత సులువు కాదు. దీంతో షూటింగ్ ఎక్కడ జరపాలి..లోకల్ లోనే సెట్స్ వేసి చేద్దామా..లేక పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా అనే ఆలోచిస్తున్నారట.