యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడం సినిమా ఫ్లాప్ అని కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. అట్టర్ ఫ్లాప్ అంటూ టాక్ వస్తున్న నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారికి అటు ఇటుగా దాదాపుగా 150 నుండి 200 కోట్ల వరకు నష్టం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ హాలీవుడ్ రేంజ్ సినిమా కనీసం 100 కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోవచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది.
ఇలాంటి సమయంలో ప్రభాస్ తదుపరి చిత్రం జాన్ గురించి నీలి నీడలు కమ్ముకున్నాయి. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ చిత్రాన్ని కూడా దాదాపుగా 125 కోట్లతో తీయాలని ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తి అయ్యే వరకు 150 కోట్లను కూడా మించుతుందని భావించారు. కాని ప్రభాస్ క్రేజ్ 50 కోట్లకు మించి లేదని గ్రహించిన యూనిట్ సభ్యులు ఇప్పుడు జాన్ బడ్జెట్ను సగానికి సగానికి తగ్గించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.