Site icon TeluguMirchi.com

ప్రభాస్‌ పెళ్లి గురించి టీవీలో ఆసక్తికర వార్తలు

Prabhas-weddingయంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ టాలీవుడ్‌లో మోస్ట్‌ బాచిలర్‌గా పేర్కోనబడుతున్నాడు. అయిదేళ్ల నుండి ‘బాహుబలి’ బరిలో చిక్కుకున్న ప్రభాస్‌ పెళ్లి గురించి అప్పటి నుండే వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభాస్‌కు సరిజ్ైున జోడీ మాత్రం ఇంతవరకు ఫిక్స్‌ కాలేదు. ఇటీవల ఓ సంపన్న కుటుంభానికి చెందిన అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి నిశ్చయం అయ్యిందనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి కానీ వాటిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. గతంలో చాలాసార్లు కూడా ప్రభాస్‌ పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని పుకార్లు తెగ హల్‌ చల్‌ చేశాయి. ఓ ఇంటర్య్వూలో ప్రభాస్‌ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే ఆయన మనం అనుకున్నప్పుడు అది కాదు కదా అంటూ చాలా ఆసక్తికర సమాధానం చెప్పాడు.
తాజాగా ప్రభాస్‌ పెళ్లి వార్తలపై పుకార్లు మరోసారి గుప్పుమన్నాయి. పలు టీవీ ఛానెల్‌లో ప్రభాస్‌కు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని, వేసవిలో పెళ్లి జరగబోతుంది అని ఆసక్తిర వార్తలు తెగ ప్రచారం అవుతుంది. అయితే విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు కానీ ప్రభాస్‌కు రహస్యంగా పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని మాత్రం తెగ ప్రచారం అవుతూ వస్తోంది. ప్రభాస్‌ పెళ్లి పుకారుపై అభిమానులు చాలా సందేహంగా ఉన్నారు. అధికారిక సమాచారం కోసం ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి ఈ విషయమై ప్రభాస్‌ స్పందిస్తాడో చూడాలి.
Exit mobile version