ఫుల్ ఖుషి లో ప్రభాస్ ఫ్యాన్స్..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల సంబరాలు అన్ని ఇన్ని కావు..ఎందుకంటే ప్రభాస్ ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు.లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్, దాదాపు 30ఏళ్ల క్రితం ఇదే అవార్డును అందుకోగా, తర్వాతి కాలంలో ఏ నటుడికి ఈ అవార్డు దక్కలేదు. ఇప్పుడు ఆ ఘనత ప్రభాస్‌కు దక్కింది.

ఇంతకీ ఈ అవార్డు ఏ చిత్రానికి వచ్చిందా అని అనుకుంటున్నారా ..ఇంకే ఏ చిత్రం మన బాహుబలి చిత్రమే. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో అన్ని దేశాల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. రష్యాలో ఈ మధ్య టీవీలలో టెలీకాస్ట్ చేయించారు. అక్కడ కూడా అభిమానుల ఆదరణను సొంతం చేసుకుంది. ఇక రష్యా సినీ లోకం కూడా బాహుబలి సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది.రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ప్రభాస్.. ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు. రష్యన్స్ బాహుబలి సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో ఈ అవార్డు ప్రభాస్ కు దక్కింది. ప్రభాస్ నటనకు రష్యన్స్ ఫిదా అవుతున్నారు. అద్బుతమైన నటన అంటూ ప్రశంసలు కురిపించారు.