
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది. మూడేళ్ల తరువాత ప్రభాస్ నుండి సినిమా వస్తుండడం తో అభిమానుల సంబరాలు ఆకాశానికి తాకాయి. రెండు రోజుల ముందు నుండే థియేటర్స్ ను ముస్తాబు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కారంపూడి మండలం కారంపూడిలో విషాదం చోటుచేసుకుంది.
రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తో ఆ ప్రాంతంలో విషాదం అల్లుకుంది. ఎదిగిన కొడుకు మరణించడం తో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతుంది. ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు ..గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యే టైములో కూడా ఇలాగే జరిగాయి. ఎప్పటికప్పుడు అభిమానులకు జాగ్రత్త అని చెపుతున్నప్పటికీ , అభిమానుల అతి ఉత్సహం వారి ప్రాణాల మీదకు తెస్తుంది.