Site icon TeluguMirchi.com

అదిరిపోతున్నాయ్‌… బాహుబలినా..! మజకానా..!!

ప్రభాస్‌ ‘బాహుబలి 2’ చిత్రంతో ఒక్కసారిగా క్రేజీ స్టార్‌గా మారాడు. ఇక ఏ స్టార్‌ హీరో అయినా ప్రభాస్‌ రికార్డులను కొల్లగొట్టాలంటే అంత సులభం కాదు అన్నంతగా కొత్త రికార్డులను నమోదు చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కూడా ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇక ప్రభాస్‌ సినిమా చేస్తే బాగుండు అని ఇతర భాషల్లోని సినీ ప్రముఖులు ఆశ పడుతున్నారు. ప్రభాస్‌ను మెప్పించే కథను కూడా సిద్దం చేసుకుంటున్నారు. సినిమాల విషయం అలా ఉంచితే ఇక పలు వ్యాపార సంస్థలు కూడా ప్రభాస్‌ను కొనుగోలు చేయడానికి సర్వ ప్రయత్నలు చేస్తున్నాయి. తమ ఉత్పత్తులకు ప్రభాస్‌ ప్రచార కర్తగా ఉంటే మంచి లాభాలు వస్తాయి అని భావించిన సదరు సంస్థలు ఎలాగైనా ప్రభాస్‌ను ఒప్పించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే నాలుగు పెద్ద పెద్ద సంస్థలు ప్రభాస్‌ను ఒప్పించడానికి సన్నాహాలు షురూ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక కంపెనీ వారయితే ఏకంగా 20కోట్లను కూడా ఒకేసారి ఆఫర్‌ చేశారు. మిగతా సంస్థలు కూడా భారీగా ముట్టజెప్పడానికి సైతం రెడీగా ఉన్నారు. ఒక యాడ్‌ చేస్తే 20కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఏమనుకుంటున్నారు బాహుబలినా..?? మజాకానా…!. ప్రభాస్‌ కలెక్షన్లు అన్ని రకాలుగా కూడా అదిరిపోతున్నాయ్‌ మరి. పారెన్‌ నుండి తిరిగి రాగానే ప్రభాస్‌ వీటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Exit mobile version