యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి 2’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న ప్రభాస్‌ను రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా షాకింగ్ సమాధానం చెప్పాడు. నాకు రాకీయాలు అసలే సూట్ కావు అంటూ నవ్వుతూ గతంలో తనకు ఎదురైన రాజకీయ అనుభవాలను గురించి పంచుకున్నాడు. పెద్దనాన్నగారు మొగుల్తూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు కొన్ని రాజకీయ భాద్యతలు అప్పగించారు. అప్పుడే రాజకీయాల పట్ల నాకు చిరాకు ఏర్పడింది అప్పుడే నాకు రాజకీయాలు అసలే సూట్ కావు అనిపించింది అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఆ ఒక్కసారి ఎన్నికల కోసం పనిచేసే వరకు నా తలప్రాణం కాస్త తోకకు వచ్చిందని ప్రభాస్ రాజకీయాల పట్ల తనకున్న అసహనం వ్యక్తం చేశాడు.
అప్పట్లో చాలామంది నా దగ్గరకు వచ్చి వారి సమస్యలు గురించి, పార్టీ సమస్యల గురించి చెబుతుండేవారు. కానీ నాకు మాత్రం రాజకీయాల పట్ల అవగాహన లేక చాలా చిరాకేసింది. చివరకు పెద్దనాన్న గారికి ఓ దండం పెట్టి మీ రాజకీయాలకు నాకు సంబంధం లేదు, ఇంకోసారి రాజకీయాల కోసం నన్ను పిలవకండి అని క్లారిటీగా చెప్పా. ఇలా తిరగడం నా వల్ల కాదు బాబోయ్… మీ రాజకీయాలకో దండం అంటూ అక్కడి నుండి వచ్చేశా, ఇక అప్పటి నుండి నాకు రాజకీయాలకు ఏ సంబంధం లేదు, నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు, రాజకీయాల్లోకి రావాలంటే చాలా దమ్ము ఉండాలి అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.