Site icon TeluguMirchi.com

ప్రభాస్ విలువ రూ. 80కోట్లు

Prabhas new look‘ఈగ’ సినిమాతో తన స్టామినా ఏమిటో మరోసారి చాటిచెప్పారు రాజమౌళి. ఇప్పుడు ప్రభాస్ ని ‘బహుబలి’గా  తీర్చిదిద్దే పనిలో పడిపోయారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో నడిచే కథ ఇది. ‘ఛత్రపతి’, ‘మగధీర’కు కలసినట్టు ఉంటుందని.. రాజమౌళి ముందే హింట్ ఇచ్చేశారు. అన్నట్టు ఈ సినిమా బడ్జెట్ రూ. 80 కోట్లట. తెలుగు చిత్రసీమకు సంబంధించినంత వరకూ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కే చిత్రమిదే. ‘రెబల్’ తో ఓ ప్లాప్ మూటగట్టుకొన్నా… ప్రభాస్ పై ఇంత భారీ మొత్తం వెచ్చించడం… సాహసమే. కథపై, ప్రభాస్ స్టామినాపై, అన్నింటికంటే ముఖ్యంగా తనపై రాజమౌళికి ఉన్న నమ్మకమే ఈ సినిమాకి పునాది. ఇందులో రానా ఓ కీలక పాత్రధారి. ప్రభాస్-రానా… సవతి సోదరుల్లా కనిపిస్తారని సమాచారం. దాదాపు రెండేళ్లపాటు ప్రభాస్ తన కాల్షీట్లను ఈ సినిమాకే కేటాయించారు. దాదాపు 40 శాతం సన్నివేశాలు బ్లూమేట్ లో చిత్రీకరించనున్నారు. ‘బహుబలి’ ఎన్ని రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.

Exit mobile version