అందాలతార అనుష్క హీరోయిన్‌గా తనకు తానే సాటిగా నిలిచింది. ఈ అమ్మడు ఎప్పుడు వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ సినిమాలతో బిజీ అవ్వాలనే చూస్తుంది కానీ పెళ్లి చేసుకుని స్థిర పడాలి అనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇంట్లో వారి ఒత్తిడి వల్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘బాహుబలి’ సినిమా వల్ల ఇంతకాలం ఆగింది లేకపోతే రెండేళ్ల క్రితమే ఈ అమ్మడి మెడలో మూడు ముళ్లు పడేవి. ‘బాహుబలి’లో హీరోయిన్ పరిస్థితిలాగే హీరోగారి పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లికి ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ప్రభాస్‌కు తగ్గ వధువు ఇంకా దొరకలేదట.
ప్రభాస్ ఇంట్లో కూడా ఎప్పటి నుండో పెళ్లి గురించి పోరు మొదలయ్యింది కానీ ‘బాహుబలి’ చిత్రం వల్లనే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ‘బాహుబలి’ విడుదల తర్వాత వెంటనే ప్రభాస్, అనుష్కల పెళ్లిల్లు ఉండనున్నాయి. ప్రభాస్, అనుష్కల పెళ్లిలు కొంత విరామంతోనే జరుగనున్నాయి. అందుకు ఇద్దరి ఇంట్లో కూడా ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టారు. ప్రముఖ బిజినెస్‌మెన్ కూతురిని ప్రభాస్ కోసం పరిశీలిస్తుండగా అనుష్క కోసం బెంగుళూరులోని ఓ కుర్రాడిని ఆమె కుటుంబం ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి త్వరలోనే ‘బాహుబలి’ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల పెళ్లిల్లు జరుగనున్నాయి.