షాక్‌: ప్రభాస్‌, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రంతో బాహుబలి ప్రభాస్‌గా జాతీయ స్థాయిలో కొనియాడబడుతున్నాడు. పలు భాషల్లో ప్రభాస్‌కు భారీగా ఫాలోయింగ్‌ పెరుగుతోంది. గతకొంత కాలంగా ప్రభాస్‌ పెళ్లిపై నానా రకాల పుకార్లు వినబడుతున్నాయి. ప్రభాస్‌ కోసం వధువును వెతికే పనిలో ఉన్నారని, వైజాగ్‌ అమ్మాయి అని పలు రకాల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రభాస్‌ ప్రేమలో ఉన్నాడని, ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితోనే ప్రేమలో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభాస్‌ ఓ స్టార్‌ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్‌ నగర్‌లో గుసగుసలు వినబడుతున్నాయి.

ప్రభాస్‌ సరసన అయిదు చిత్రాల్లో రొమాన్స్‌ చేసిన హీరోయిన్‌ అనుష్కతో ప్రభాస్‌ ప్రేమలో ఉన్నాడట. ఇద్దరు కలిసి ఎక్కువ కాలం పని చేయడంతో ఇద్దరి మద్య ప్రేమ చిగురించిదని, అందుకే ఇద్దరు కూడా పెళ్లి గురించి ఇంకా అధికారికంగా మాట్లాడటం లేదు అని వినికిడి. ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఎటూ తేల్చుకోలేకనే ఇంకా పెళ్లి గురించి జాప్యం వహిస్తున్నారు అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇటీవల హీరో, హీరోయిన్‌ల ప్రేమ పెళ్లిల్లు బాగానే జరుగుతున్నాయి. కాబట్టి ఇది నిజమైతే బాహుబలి, దేవసేనల అభిమానులు ఖుషీగానే ఫీలవుతారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ప్రభాస్‌గానీ, అనుష్కగాని స్పందించే దాకా ఎదురుచూడాలి.