‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రానికి ముందు ప్రభాస్ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే డార్లింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ చిత్రం తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాహుబలుడు అనేమాట వాస్తవం. ‘బాహుబలి’ చిత్రంతో భారీ వసూల్లు రాబట్టిన ప్రభాస్ మిగతా చిత్రాలు కూడా ఈ స్థాయిలో వసూల్లు రాబడుతాయి అనేది మాత్రం అపోహనే. ‘బాహుబలి’ కథ అంటే విభిన్నమైన, కుతూహల ప్రాజెక్ట్ కాబట్టి ఈ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఒక సినిమా రహస్యాన్ని రెండు సంవత్సరాల పాటు బయటకు రాకుండా అందరి నోళ్లు కట్టేయడం కేవలం రాజమౌళికే సాద్యం. సో అలా ‘బాహుబలి’ చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నిర్మాతలు కూడా విభిన్నమైన అంశం అని వందల కోట్లలో ఖర్చు చేశారు. అంత మొత్తం కంటే ఎక్కువగానే విడుదల చేసి మంచి లాభాలను అందిస్తుంది.
ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రం వెయ్యి కోట్లు రాబడితే ప్రతీ చిత్రం కూడా అంత మొత్తంలో రాబట్టడం మాత్రం అసాద్యం. ప్రభాస్ తదుపరి చిత్రాలు కూడ అంత మొత్తంలో రాబట్టాలంటే గగనమే. ‘బాహుబలి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సుజీత్ ఈ చిత్రాన్ని 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఒక తెలుగు చిత్రం సాదారణ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వంద కోట్లు ఖర్చు చేస్తేనే అది చాలా ఎక్కువ. అలాంటిది ‘బాహుబలి’ వల్ల ఈ చిత్రానికి ఏకంగా 150కోట్లను కేటాయిస్తున్నారు. కానీ ఇంత మొత్తంలో బడ్జెట్ చాలా ఎక్కువ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ చేసే చిత్రాలన్ని ‘బాహుబలి’లు కాదు బాబు, మరీ అంత అతి చేసి బొక్కా బోక్లా పడొద్దు అంటూ సినీ విశ్లేషకులు కొందరికి హితబోద చేస్తున్నారు.