బాహుబలి చిత్రం తర్వాత మరోసారి దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు మరియు ప్రేమికులు అంతా కూడా తెలుగు సినిమా పరిశ్రమ వైపు చూసేలా చేసిన ఘనత సాహో చిత్రంకు దక్కింది. బాహుబలి ఇచ్చిన, తెచ్చిన క్రేజ్‌తో ప్రభాస్ ఈ చిత్రంను చేయడం జరిగింది. సాహో చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్‌ను మరోసారి దక్కించుకునేందుకు ప్రభాస్ సిద్దంగా ఉన్నాడు. భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంకు రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకంతో అంతా ఉన్నారు.
ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇదో అద్బుతమైన సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నా కోసం ఎక్కడ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని వారు నిర్మించారు. సినిమా అనుకున్న సమయంలో ప్లాన్ చేసుకున్న బడ్జెట్‌కు 100 కోట్లు అదనంగా అయ్యింది. అయినా కూడా వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పెట్టారంటూ చెప్పుకొచ్చాడు. వంద కోట్ల రూపాయలు వారు నా కోసం ఖర్చు పెట్టడం జరిగిందని ఎమోషనల్ అయ్యాడు. పెట్టిన ప్రతి పైసాకు ప్రతిఫలం ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.