‘సాహో’ 100 కోట్ల పారితోషికంపై క్లారిటీ

350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రంలో నటించినందుకు గాను ప్రభాస్‌ దాదాపుగా 100 కోట్లకు పైగా పారితోసికంను అందుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. సాహో చిత్రంను ప్రభాస్‌ సన్నిహితులు నిర్మించారు. ప్రభాస్‌ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే భాగస్వామి అయ్యాడు. అలా భాగస్వామి అవ్వడం వల్ల వారి పెట్టుబడి పోగా మిగిలిన మొత్తం షేర్‌ చేయగా 100 కోట్లకు పైగా ప్రభాస్‌కు దక్కుతుందని ఇష్టం వచ్చినట్లుగా లెక్కలు వేశారు. ఎవరికి ఇష్టం వచ్చన తీరున వారు ప్రభాస్‌ పారితోషికం గురించి మాట్లాడటం జరిగింది.

ఈ సమయంలోనే ప్రభాస్‌ సాహో చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సాహో చిత్రం కోసం 100 కోట్లు తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తన రెగ్యులర్‌ పారితోషికం నుండి 25 శాతం నిర్మాతలకు ఇచ్చాను అని, సినిమా ఎక్కువ బడ్జెట్‌ అయిన కారణంగా నా పారితోషికం వారికి భారం కావద్దని తాను అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మీడియాలో ప్రచారం జరుగుతున్నంత పారితోషికం మాత్రం తాను తీసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఎంత పారితోషికం తీసుకున్న విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.