కాని ప్రభాస్ మాత్రం తనలో ఉన్న ఒక లోపంను చెప్పుకొచ్చాడు. చాలా కాలంగా ప్రభాస్ గొంతు గురించి విమర్శలు ఉన్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్‌ను కూడా లో పిచ్‌లో చెప్తాడనే టాక్ ఉంది. అందుకే ఆయన కొన్ని సీరియస్ డైలాగ్స్ చెప్పిన సమయంలో ఆ సీరియస్ నెస్ కనిపించదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. తన గొంతుకు సంబంధించి ఉన్న లోపంను సరి చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. త్వరలోనే ఆ సమస్య నుండి తాను బయటకు వచ్చి పవర్ ఫుల్ గొంతుతో డబ్బింగ్ చెప్తానంటూ హామీ ఇచ్చాడు.