యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ , గోపికృష్ణ బ్యానర్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జార్జియా షెడ్యూల్ పూర్తీ చేసుకొని ఇండియా కు వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ కు మాత్రం స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తుండడం తో షూటింగ్ లు ఆగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిపేందుకు డిసైడ్ అయ్యారట.కరోనా ప్రభావం ఇప్పుడే తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నెక్స్ట్ షెడ్యూల్ కి టైం ఉండటంతో ఖాళీగా ఉండే బదులు పోస్ట్ ప్రొడక్షన్ పని పూర్తి చేద్దామని దర్శక , నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సెట్ వేసి తదుపరి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని విశ్వసనీయ సమాచారం.