Site icon TeluguMirchi.com

ప్రభాస్ 20 లుక్ ఇలా ఉండబోతుందట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ , గోపికృష్ణ బ్యానర్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా జార్జియా షెడ్యూల్ పూర్తీ చేసుకొని ఇండియా కు వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ కు మాత్రం స్మాల్ బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ కోసం యావత్ ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ లుక్ ఇలా వుండబోతుందనే వార్త బయటకొచ్చి అభిమానుల్లో ఆసక్తి నింపుతుంది.

ప్రభాస్ ని ఇంతవరకు చూడని లుక్ లో చూపిస్తానంటూ.. వివిధ రకాల అప్పటి పీరియాడిక్ టైంలో ఉండే లుక్స్ ట్రై చేస్తున్నాడట. 1960లోని గాఢమైన ప్రేమకథ కాబట్టి ఆ ట్రెండ్ కి తగ్గ లుక్స్ డిసైన్ ప్రత్యేకంగా చేస్తున్నారట చిత్రయూనిట్. ప్రభాస్ ఇంతవరకు చూడని వైవిధ్యమైన లుక్ బాడీ లాంగ్వేజ్ లో కనిపించబోతాడని అంటున్నారు.

Exit mobile version