ఫిల్మ్ సిటీలో ‘పోటుగాడు’

manoj-potugaduమంచు మ‌నోజ్‌ ది వైవిధ్యమైన దారి. విజ‌యాలు రానీ… రాక‌పోనీ – వైవిధ్యభ‌రిత‌మైన క‌థ‌లు ఎంచుకొంటారాయ‌న‌. పాట‌లు, ఫైటింగులు, కాస్ట్యూమ్స్ ఇలా అన్నింట్లోనూ ఆయ‌న ప్రమేయం ఉంటుంది. ఇప్పుడాయ‌న ‘పోటుగాడు’గా ద‌ర్శన‌మిస్తున్నాడు. ప‌వ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రమిది. ల‌గ‌డపాటి శ్రీ‌ధ‌ర్ నిర్మాత‌. ఇందులో మనోజ్ ప‌క్కన అయిదుగురు క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. అంటే ప్లేబోయ్ త‌ర‌హా పాత్రలో క‌నిపించ‌నున్నార‌న్నమాట‌. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. మ‌నోజ్‌ పై యాక్షన్ ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.