Site icon TeluguMirchi.com

పోటుగాడు పాట‌లొచ్చాయ్‌!

Potugadu Audio Launchమంచు మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం పోటుగాడు. ప‌వ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవ‌ల విడుద‌ల‌య్యాయి. తొలి సీడీని మోహ‌న్‌బాబు ఆవిష్కరించారు. కీర‌వాణి స్వీక‌రించారు. ”ఏ సినిమా ఎంత విజ‌యం సాధిస్తుందో ఎవ‌రూ చెప్పలేరు. కానీ క‌ష్టప‌డితే త‌ప్పకుండా ఫ‌లితం ఉంటుంది. మ‌నోజ్ ఓ సినిమా కోసం చాలా రిస్క్‌లు చేస్తుంటాడు. డూప్‌లేకుండా ఫైట్లు చేస్తుంటాడు. టెక్నాల‌జీ పెరిగిపోయిన‌ప్పుడు ఇవ‌న్నీ అన‌వ‌స‌రం అని చాలాసార్లు వారించా. కానీ వినన‌డం లేదు” అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాస‌రి చెబుతూ ”మనోజ్ అల్లరి కుర్రాడ‌వుతాడేమో అనిపించింది. ఎందుకంటే వాడు చిన్నప్పుడు నా భుజాల‌పై ఆడుకొని పెరిగాడు. కానీ ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. పాట‌లు పాడుతున్నాడు, పాట‌లు రాస్తున్నాడు, ఫైట్ మాస్టర్‌గా మారాడు, సినిమాలు తీస్తున్నాడు ఇలా తానేం చేయ‌గ‌ల‌డో నిరూపించుకొంటున్నాడు. మోహ‌న్‌బాబే కాదు, వారి బిడ్డలు కూడా చ‌క్కటి క్రమ‌శిక్షణ అల‌వ‌ర్చుకొన్నార‌న్నారు”. ఈ సినిమా హ‌లీవుడ్ రేంజులో ఉంటుంద‌నంటున్నారు మ‌నోజ్‌. త్వర‌లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‌న్నారు నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్‌. ఈ కార్యక్రయంలో విష్ణు, ల‌క్ష్మీ ప్రస‌న్న‌, నాగ‌చైత‌న్య‌, అల్లరి న‌రేష్‌, వ‌రుణ్ సందేశ్‌, నాని, శ‌ర్వానంద్‌, సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version