స్విమ్మింగ్ పూల్ లో జిగిలే రాణి..చూస్తే జిగేల్ అనాల్సిందే..

పూజా హగ్దే ఈ పేరు ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీ లలో తెగ చక్కర్లు కొడుతుంది. తెలుగు లో ముందుగా ఈమె ఐరెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ ..అల్లు అర్జున్ డీజే సినిమా తరువాత సినిమా తర్వాత అమ్మడి జతకమే మారిపోయింది. అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడం..తాజాగా మహేష్ తో చేసిన మహర్షి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో అమ్మడికి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి.

ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు , ప్రభాస్ తో జాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ రెండు హిట్లయితే పూజా మరోస్థాయికి వెళ్లడం ఖాయం. ఇక ఈ భామ కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటూ నెటిజనులను ఆకట్టుకుంటూ వస్తుంటుంది.

తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “తుఫాను ముందు ప్రశాంతత. ఈ ఏడాదిలో నేను చేయాల్సిన సినిమాల వర్క్ ను ప్రారంభించేముందు ఆస్వాదిస్తున్న చివరి ప్రశాంతమైన మునక” అంటూ క్యాప్షన్ పెట్టింది. పూల బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ కెమెరాకు ఒక అందమైన పోజిచ్చింది. ఈ ఫోటో ఆలా పోస్ట్ చేసిందో లేదో తెగ లైక్స్..షేర్స్ చేస్తూ అభిమానులు తమ అభిమాన్నాయి చూపిస్తున్నారు.