ప్రభాస్‌ అంటే పిచ్చి… పెళ్లి కూడా చేసుకుంటా

pooja‘రైట్‌ రైట్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఇటీవలె విడుదలయిన ‘ద్వారక’ చిత్రంలో కూడా మెరిసిపోయిన ముద్దుగుమ్మ పూజా జవేరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ అమ్మడికి ప్రభాస్‌ అంటే పచ్చి అంటా..!! అంతేకాదు ప్రభాస్‌ ఒప్పుకోవాలే కాని పెళ్లికి ఇప్పుడంటే ఇప్పుడే రెడీ అని తెగించి చెబుతోంది. ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి ఏదైనా చేస్తాను అని ఈ అమ్మడు చాలా గట్టిగా చెబుతోంది. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బాచిలర్‌ అయిన ప్రభాస్‌కు మూడు ఏళ్లుగా అమ్మాయిల వేట సాగుతూనే ఉంది. కాని ప్రభాస్‌కు అమ్మాయి ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్‌ కాలేదు.

ప్రస్తుతం ప్రభాస్‌కు 37ఏళ్లు. ఇంకో మూడు ఏళ్లు అయితే నలబై ఏళ్ల మనిషి అవుతాడు అలాంటిది ఈయన ఇంకా పెళ్లి చేసుకోవడానికే సముఖత వ్యక్తం చేయడం లేదు. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను అని పూజా జవేరి వ్యాఖ్యలు ఒకవేళ ప్రభాస్‌ సీరియస్‌గా తీసుకుంటే ఈ ఇద్దరికి పెళ్లి కుదురుతుందా…!! అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అసలే ప్రభాస్క్‌ అమ్మాయిల ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. సినీ పరిశ్రమ కాకున్నా కూడా సంపన్నుల కుటుంబాలు కూడా ప్రభాస్‌కు అమ్మాయిని ఇవ్వడానికి క్యూ కడుతుంటారు. మరి ప్రభాస్‌ పెళ్లికి ఎప్పుడు ముహుర్తం వస్తుందా…?? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.