ఎఫ్ 3 లో పూజా హగ్దే ఐటెం సాంగ్..ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా..?


వరుస హిట్ల తో దూసుకెళ్తున్న పూజా హగ్దే..తాజాగా ఎఫ్ 3 లో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో రంగస్ధలం మూవీ లో ఐటెం సాంగ్ చేసి..అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ లో చిందులేయబోతుంది.

ఇక ఈ సాంగ్ కు ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కపాట కోసం మరీ ఆ రేంజ్‌లో డిమాండ్‌ చేయడమా? అని ఆశ్చర్యపోయిన నిర్మాతలు కోటి రూపాయలు అయితే ఇవ్వగలమంటూ ఆమెకు సర్దిచెప్పి ఒప్పించారట. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.