ప్రభాస్ పూజా హెగ్డే … వీరిద్దరు కలిసి దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవల ఈ చిత్రం జార్జియా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. అయితే కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పుడే టీం షూటింగ్ కి వెళ్ళింది. దీనిపై పూజ స్పందించింది.
‘లాక్డౌన్ కన్నా ముందే భారత్‌కు తిరిగి రావడం మా అదృష్టం. జార్జియాకు వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. కరోనా నేపథ్యంలో వీలైనంత తొందరగా భారత్ రావాలనే ఉద్దేశంతో షూటింగ్‌ను ముందుగానే ముగించుకున్నాం. జార్జియా నుంచి ఇంటికి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా” అని చెప్పుకొచ్చింది పూజ.