ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు శ్రీదేవి. ఈ ఫొటో నేపథ్యం చూస్తుంటే కాస్త ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. పెద్ద ఎత్తున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తమిళ జిగర్తాండ చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెల్సిందే. జిగర్తాండలో హీరోయిన్ పాత్ర ఉండదు. కాని పూజా హెగ్డే పాత్రను దర్శకుడు హరీష్ శంకర్ జొప్పించడం జరిగింది. తెలుగులో కమర్షియల్ సక్సెస్ను దక్కించుకోవాలంటే పూజా హెగ్డే ఉండాల్సిందే అని ఆమెను ఉంచాడు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.