‘వాల్మీకి’ శ్రీదేవి ఇదుగో

వరుణ్‌ తేజ్‌ కీలక పాత్రలో మరో హీరో అధర్వ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన పూజా హెగ్డే ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పూజా చాలా విభిన్నంగా కనిపించబోతుంది. ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించని విధంగా హరీష్‌ శంకర్‌ ఈ చిత్రంలో ఆమెను చూపిస్తున్నాడు. సైకిల్‌పై లంగా ఓనీతో పూజా హెగ్డే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు శ్రీదేవి. ఈ ఫొటో నేపథ్యం చూస్తుంటే కాస్త ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. పెద్ద ఎత్తున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తమిళ జిగర్తాండ చిత్రానికి ఇది సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. జిగర్తాండలో హీరోయిన్‌ పాత్ర ఉండదు. కాని పూజా హెగ్డే పాత్రను దర్శకుడు హరీష్‌ శంకర్‌ జొప్పించడం జరిగింది. తెలుగులో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోవాలంటే పూజా హెగ్డే ఉండాల్సిందే అని ఆమెను ఉంచాడు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్‌ అయ్యేనో చూడాలి.