పూజా అందాలకు ముగ్దుడయిన కరణ్‌ జోహార్‌

స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘డీజే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. మొదట్లో పద్దతిగా కనిపించిన పూజాకు పెద్దగా అవకాశాలు రాకపోయే వరకు ఇక హాట్‌గా నటించడానికి సిద్దమయ్యింది. బన్నీ సరసన అడిగిన దానికంటే ఎక్కువే ఆరబోసి హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది. ‘డీజే’ చిత్రంతో పూజాకు మంచి ఆఫర్‌లు కచ్చితంగా వస్తాయి అని టాక్‌. ఈ చిత్రంలో పూజా అందాలను చూసి బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ పూజాకు కాల్‌ చేశాడట.

పూజా లుక్‌ చూసి ముగ్దుడయిన కరణ్‌ జోహార్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ చిత్రం కోసం పూజాను సంప్రదించినట్టు తెలుస్తోంది. కరన్‌ జోహార్‌ ఆఫర్‌ అనగానే పూజా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఈ అమ్మడికి కరణ్‌ జోహార్‌ ఆఫర్‌ నిజమైతే కానీ పూజా కెరియర్‌ ఇక మలుపు తిరిగినట్టే. బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ అంటే ఒక బ్రాండ్‌. ఆయన సినిమాలు ఎలా ఆడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది పూజాకు ఆయన చిత్రంలో అవకాశం వస్తే ఇక పూజాకు మంచి లక్‌ తగిలినట్టే. తెలుగులో కూడా ‘డీజే’ చిత్ర ఫలితంపై అవకాశాలు ఆదారపడి ఉన్నాయి.