Site icon TeluguMirchi.com

రంగస్థలంలో పూజ ఎంట్రీ

సుకుమార్ సినిమా అంటే డెఫినెట్ గా ఓ స్పెషల్ సాంగ్ ఉటుంది. ఇప్పుడు చరణ్ ‘రంగస్థలం’లో కూడా ఒక స్పెషల్ సాంగ్ వుంది. తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ షూట్. పూజా హెగ్డేపై ఆ సాంగ్ నుచేస్తుంది. ఈ రోజున ఈ పాట చిత్రీకరణను మొదలుపెట్టారు.

ఈ ఐటమ్ సాంగ్ ను జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. సుకుమార్ సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఐటమ్ సాంగ్స్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునేలా వుంటాయి. ‘ఆర్య’ సినిమాలోని ‘అ .. అంటే అమలాపురం’లోని ఐటమ్ సాంగ్ అందుకు ఓ నిదర్శనం. ఆ తరహాలోనే ‘రంగస్థలం’లోని ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version