టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటైన పొలిమేర ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ‘మా ఊరి పొలిమేర’ రెండేళ్ల క్రితం ఓటీటీ లో విడుదలై ఊహించని విజయం అందుకోగా, దీనికి సీక్వెల్ గా వచ్చిన పొలిమేర 2 థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్లో పార్ట్ 3 పై క్యూరియాసిటీ ని పెంచింది. అయితే ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పొలిమేర 3’ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
Also Read : ‘కన్నప్ప’ లో ‘తిన్నడు’ వాడే విల్లు అంత ప్రత్యేకమైందా..?
తాజాగా ‘పొలిమేర 3’ రానున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘పొలిమేర 3’ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి.
Let's BEGIN the SHOW
Get Ready for the Spine-Chilling #Polimera3, next part of #Polimera Franchise
#Polimera3Loading..
A @DrAnilViswanath Film
Produced by @connect2vamsi – #VamsiNandipati
Co-Produced by #BhogendraGupta
ing @Satyamrajesh2 #DrKamakshiBhaskarla pic.twitter.com/lr3zbs8y6M
— Vamsi Nandipati Entertainments (@VNE_Offl) July 10, 2024
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాము. ఈ సారి ఇంక ఎక్కువ భయపెడతాం, అనేక ట్విస్ట్ లతో మీ ఊహకందని విధంగా ఉండబోతోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘పొలిమేర 3’ లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.