హీరో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడని ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, తన నంబర్‌ను బ్లాక్ లో పెట్టినట్లు ఫిర్యాదులో తెలిపింది. రాజ్ తరుణ్, తాను గత 11 ఏళ్ళుగా రిలేషన్ లో ఉన్నామని.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నట్లు లావణ్య తెలిపింది. కానీ ఇప్పుడు సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేసాడు. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాతో కాంటాక్ట్‌లో కూడా లేడు. రాజ్ తరుణ్ ని వదలకపోతే చంపేసి బాడీ మాయం చేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయి.
Also Read : గొయ్యి తవ్వుతున్న రష్మిక !!
అంతేకాదు గతంలో తనను కావాలనే కొంతమంది డ్రగ్స్ కేసులో ఇరికించారని, తనకు ఆ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఇక తాను అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని చెప్పింది. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకు ఎలాంటి సహాయం చేయలేదని తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి ఈ ఫిర్యాదుపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. ఇకపోతే ప్రస్తుతం రాజ్ తరుణ్ తిరగబడరా సామీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్గా నటిస్తోంది.
Also Read : పిల్లలు వద్దంటున్న సుహాస్..