Site icon TeluguMirchi.com

ఆ పదం తీసేయాలంటూ ‘బాహుబలి 2’పై కేసు నమోదు

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం విడుదలయ్యి చరిత్రను తిరగరాస్తూ కొత్త రికార్డులను నమోదుచేస్తుంది. ఇంత గొప్ప విజయం సాధించిన ‘బాహుబలి 2’ చిత్రంపై కూడా వివాదాలు లేకుండా పోలేదు. ఈ చిత్రాన్ని విమర్శించిన వారు కొందరుంటే ఈ చిత్రంపై నానా రచ్చ చేసేవారు మరికొంతమంది ఉంటారు. భారీ విజయం సాధించిన ఈ చిత్రంపై పలు రకాలుగా వివాదాలు వస్తున్నాయి. ఈ చిత్రం తమను అవమానించే విధంగా ఉందంటూ అరికటిక సంఘాల వారు తాజాగా హైద్రాబాద్‌ సెన్సార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

‘బాహుబలి 2’ చిత్రంలోని పలు సన్నివేశాలు తమని కించపరిచే విధంగా ఉన్నాయని అరికటిక సంఘం వారు ఆరోపిస్తున్నారు. ఈ చిత్రంలో కటిక చీకటి అనే పదం వాడారని, ఆ పదం తమను కించనరిచే విధంగా ఉందని, వెంటనే ఆ పదాన్ని తొలగించాలని లేదంటే దర్శకుడైన రాజమౌళి ఇంటిని సైతం ముట్టడిస్తామని అరికటిక సంఘాల హైద్రాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Exit mobile version