పీకే రికార్డు ‘పీకి’ పడేసిన బాహుబలి..

రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి – ది కంక్లూజన్’ గత నెల 28 న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9 వేల థియేటర్స్ లలో రిలీజ్ అయి సంచలన రికార్డ్స్ నమోదు చేస్తుంది..బాలీవుడ్ ఖాన్ ల రికార్డ్స్ సైతం అడ్రెస్ లేకుండా చేస్తుంది. తాజాగా అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ లైఫ్ గ్రాస్ ను కేవలం ఆరు రోజుల్లో పీకి పారేసి అందరికి షాక్ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా పీకే లైఫ్ టైమ్ గ్రాస్ రూ.745 కోట్లుగా ఉండగా బాహుబలి మొదటి ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సుమారు రూ. 770 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రం అనే ఘనత తెలుగు సినిమా పేరిట నిలిచిపోయింది. అంతే కాదు మరో 15 రోజుల్లో బాహుబలి రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు. మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి సునామి మాములుగా లేదు..ఆరు రోజుల్లో రూ. 109 కోట్లు దాటేసి అరుదయిన రికార్డు సాధించింది.