Site icon TeluguMirchi.com

బ్యాకాంక్ లో ‘పెళ్ళి పుస్తకం’

Pelli-Pustakamప్రేమకథలకు ముగింపు పెళ్ళిళ్లు కాదు. అసలు ప్రేమకథ మొదలయ్యేది పెళ్లి తర్వాతే… అని తెలిపే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం’ పెళ్ళి పుస్తకం’. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్, ‘మేం వయసుకు వచ్చాం’ ఫేమ్ నీతిటేలర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. రామకృష్ణ మచ్చకంటి దర్శకుడు. బి. నాగిరెడ్డి, బి.వి. గోపాల్, పి. సుమన్ నిర్మాతలు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ – “హృదయాలను హద్దుకునే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. దర్శకుడు రామకృష్ణ చాలా పొయిటిగ్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 9 నుంచి 18 వరకు బ్యాంకాక్, మలేసియాల్లో హీరోహీరోయిన్లపై రెండు పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది” అని తెలిపారు.

అనిల్, యశస్విని, దేశానంది, నాగివీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : మరుధూరి రాజా, సంగీతం : శేఖర్ చంద్ర, కెమెరా : జవహర్ రెడ్డి, సౌండ్ డిజైనర్ : ఇ. రాథాకృష్ణ, కూర్పు : మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాణం : లక్ష్మీ నరసింహ సినీ విజన్స్.

Exit mobile version