Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో 100 రోజులు ఆడిన చిత్రంగా రికార్డు…

Pelli-Chupulu-100daysఈ మధ్య కాలంలో ఎంత గొప్ప చిత్రమైన , 500 కోట్లు కొల్లగొట్టిన చిత్రమైన థియేటర్స్ లలో 100 రోజులు ఆడే రోజులు పోయాయి..అలాంటిది ఎటువంటి ఆర్భటం లేకుండా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ-రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం జూలై 29న థియేటర్లలోకి వచ్చింది..ఫస్ట్ షో తోనే మంచి సినిమాగా టాక్ తెచ్చుకొని , ఆ తర్వాత స్క్రీన్స్ పెంచుకుంటూ రేపటితో వంద రోజులను పూర్తి చేసుకుంటోంది..

ఈ మధ్య కాలం లో హైదరాబాద్ లో 100 రోజులు ఆడిన చిత్రలేవు..అలాంటిది ఆ రికార్డు ను పెళ్లి చూపులు బ్రేక్ చేసింది. ఇక ఓవర్సీస్ లో అయితే సరికొత్త రికార్డు ను నెలకొల్పింది.అతి తక్కువ రేట్లకే రైట్స్ కొనుక్కున్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు..1.2మిలియన్ డాలర్లను తెచ్చిపెట్టి భారీ లాభాలను అందించింది. ఇటీవల తమిళ రైట్స్ ను గౌతమ్ మీనన్ తీసుకున్నాడు. నిన్న హైదరాబాద్ లో ఈ చిత్ర 100 రోజుల వేడుకను జరుపుకున్నారు.

Exit mobile version