సాయం చేయాల్సిన టైములో ఈ పనులేంటి పాయల్..?

RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. అయినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్ద అగ్ర హీరోల ఛాన్సులు రావడం లేదు. చిన్న చితకా చిత్రాలకు, సీనియర్ హీరోల పక్కన సెకెండ్ లీడ్ కే పరిమితం అవుతుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లన్ని బంద్ కావడం తో సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందిని చూసిన చిరంజీవి సీసీసీ ఛారిటీ ఏర్పటు చేసి వారికీ విరాళాల రూపంలో సాయం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఆపద సమయంలోనూ హీరోయిన్స్ ఎవరికీ సాయం చేయడానికి చేతులు రాలేదు. కోట్లు రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకునే బడా హీరోయిన్స్ సైతం పత్తా లేకుండా పోయారు. అయితే లావణ్య త్రిపాఠి, యాంకర్ రష్మి, ప్రణీత లాంటి చిన్న చిన్న వాళ్లు మాత్రమే తమకు తోచిన సాయం చేశారు. ఇలాంటి టైం లో పాయల్ పార్క్‌లో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయడం తో అంత ఆమెను విమర్శిస్తున్నారు. బాధ్యత ఉండక్కర్లా!! ఒకవైపు ప్రభుత్వాలు జనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ చుట్టూ ఉండే జనాన్ని.. ఈ దేశాన్ని కాపాడండి అంటూ చెప్తూనే ఉన్నా.. ఏ మాత్రం బాధ్యత లేకుండా లాక్ డౌన్ టైంలో పార్కుల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులు కొడతావా? అంటూ ఫైర్ అవుతున్నారు. కరోనా బాధితులకు సాయం చేయడానికి చేతులు రావు కానీ ఫోటోలకు పోజులు ఇవ్వడం మాత్రం వస్తాయా అని మండిపడుతున్నారు.