Site icon TeluguMirchi.com

ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ‘బ్రో’ టీజర్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘బ్రో’. త‌మిళ హిట్ ఫిల్మ్ ‘వినోదాయ సితం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.

చీకటిలో చిక్కుకొని ఒకరి సహాయం కోరుతున్న సాయి ధరమ్ తేజ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. అతను వారిని ‘మాస్టర్’, ‘గురు’, ‘తమ్ముడు’ అని రకరకాలుగా సంబోధిస్తాడు. చివరకు ‘బ్రో’ అని పిలుస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. ‘తమ్ముడు’ సహా తన ఇతర హిట్ చిత్రాలను గుర్తు చేస్తూ టీ గ్లాస్ పట్టుకుని పవర్ స్టార్ అనేక రకాల లుక్స్ లో కనిపిస్తారు. మొదట పవన్ కళ్యాణ్ ఓం లాకెట్ ధరించి మనోహరమైన చిరునవ్వుతో కనిపించారు. ఆ తర్వాత కూలీ దుస్తులు ధరించి ‘కాలం మీకు అంతు పట్టని ముడి జాలం’ అంటూ సాయి ధరమ్ తేజ్‌కి స్వాగతం పలికారు. ఇక చివర్లో ‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు’ అంటూ కారులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ని ముగించిన తీరు బాగుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ టీజర్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కి ట్రీట్ అదిరిందనే చెప్పొచ్చు.

BRO Teaser | Pawan Kalyan | Sai Tej | Trivikram | Samuthirakani | ThamanS | People Media Factory

Exit mobile version