Site icon TeluguMirchi.com

దటీజ్ పవన్ కల్యాణ్…

pawan-nandi-award-winner

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సౌమ్యత, మంచితనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నా తన కష్టంగా భావిస్తారు. సంతోషంలో ఉంటే ఆయన ఉప్పొంగుతారు. అంతేకాకుండా తనను అభిమానించే వారు, తాను ఇష్టపడేవారు ఎదైనా సాధిస్తే ఎలాంటి భేషాలు లేకుండా పవన్ కల్యాణ్ ఆనందపడుతారని ఆయన సన్నిహితులు చెప్పుతుంటారు. అందుకు ఉదాహరణ మరో ఘటన ఆవిష్కృతమైంది.

పవన్ కల్యాణ్ క్రియేట్ వర్క్స్ బృందంలో చాలా ఏళ్లు పనిచేసిన దయా కొడవటిగంటి దయానంద్ రెడ్డిని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నంది పురస్కారం వరించింది. అలియాస్ జానకి చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయనకు ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు అవార్డు దక్కింది. నంది అవార్డు లభించిన సందర్భంగా దయానంద్ రెడ్డి శుక్రవారం పవన్ కల్యాణ్ కలిసి తన ఆనందాన్ని ఆయనతో పంచుకొన్నారు.

‘రామోజీ ఫిలిం సిటీలో కాటమరాయుడు షూటింగ్‌లో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిశానని, ఆయన రిసీవ్ చేసుకొన్న తీరుతో తాను ఉద్వేగానికి లోనయ్యాను. పవన్ కల్యాణ్ అభినందనలతో నంది పురస్కారం లభించిన ఆనందం రెండింతలు అయింది’ అని దయానంద్ రెడ్డి పంచుకొన్నారు.

ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకొన్నారని దయానంద్ రెడ్డి తెలిపారు. అందుకు తాను ప్రస్తుతం ఓ సినిమా కథకు సంబంధించిన స్క్రిప్ట్‌పై దృష్టిపెట్టానని తెలిపినట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పవన్ తనకు పలు సూచనలు ఇచ్చారని, పవన్ మంచితనానికి అది నిదర్శనం అని దయా వెల్లడించారు.

‘కాటమరాయుడు షూటింగ్‌ బృందానికి పవన్ కల్యాణ్ పరిచయం చేశాడు. సీనియర్ నటుడు ఆలీ, నిర్మాత బండ్ల గణేశ్, నటులు అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, కోరియోగ్రాఫర్ గణేశ్ తదితరులకు తన గురించి బాగా చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. స్వయంగా ఫొటోగ్రాఫర్లను పిలిచి ఫొటో దిగడం నా జీవితంలో మరో మరిచిపోలేనటువంటి ఘటన’ అని దయానంద్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో సీనియర్ నటులు అజయ్, చైతన్యకృష్ణలకు కూడా నంది అవార్డులు వచ్చాయని, వారిని కూడా కలువడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Exit mobile version